Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు విశాఖలో పర్యటించనున్న జనసేన అధినేత పవన్

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. తుపాను బాధితులను పరామర్శిస్తారు. సహాయక చర్యల కోసం సీఎం సహాయక నిధికి రూ. 50 లక్షలను పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, తన అభిమానులందరూ సహాయక చర్యల్లో పాలుపంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖ పర్యటన సందర్భంగా, అక్కడే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

More Telugu News