దుర్గా పూజ ఓ సామాజిక ఉత్సవం: ప్రణబ్ ముఖర్జీ
దుర్గా పూజ ఓ మతపరమైన ఉత్సవం మాత్రమే కాదని, అదో సామాజిక ఉత్సవం కూడా అని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాకుండా, తన ఇంట జరిగే దుర్గా పూజకు అందరినీ ఆహ్వానించారు. రాష్ట్రపతి నాలుగు రోజుల పర్యటనకు గాను పశ్చిమ బెంగాల్లో ఉన్నారు. మంగళవారం ఆయన కోల్ కతా నుంచి హెలికాప్టర్లో బిర్భూమ్ జిల్లా కిర్నాహార్ కు చేరుకున్నారు. అక్కడ తన సోదరి అన్నపూర్ణ బెనర్జీ నివాసానికి వెళ్ళారు.