విభజన వల్ల రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్: మంత్రి కామినేని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభజన వల్ల రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్: మంత్రి కామినేని

రాష్ట్ర విభజన వల్ల రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఏర్పడిందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. లోటు బడ్జెట్ ఉన్నా సామాజిక పింఛన్లు పెంచుతున్నామని తెలిపారు. ఈ మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరులో మాట్లాడిన మంత్రి, ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, రూ. 45 వేల కోట్లు రైతు రుణమాఫీ చేస్తారని వెల్లడించారు. ఇందుకు ఆర్ బీఐ అనుమతి రావడమే ఆలస్యం అవుతోందన్నారు. ఇక విజయవాడ నగరపాలక సంస్థ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు.

More Telugu News