యూకేలో తెలుగు విద్యార్థి ప్రాణం తీసిన మొబైల్ చాటింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూకేలో తెలుగు విద్యార్థి ప్రాణం తీసిన మొబైల్ చాటింగ్

మొబైల్ చాటింగ్ లో మునిగిపోయిన ఓ తెలుగు విద్యార్థిని రైలు బలిగొన్నది. ఈ ఘటన యూకేలోని కిట్స్ గ్రోవ్ రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. దేవభక్తుని సుజిత్ (22) అనే విద్యార్థి ఆంధ్రా యూనివర్శిటీలో మెటలర్జీ పూర్తి చేసి ఎంఎస్ విద్య నిమిత్తం యూకే చేరుకున్నాడు. ఈ యువకుడు మాంచెస్టర్ వెళ్ళేందుకు రైలు కోసం కిట్స్ గ్రోవ్ రైల్వే స్టేషన్లో ఎదురుచూస్తున్నాడు. రైలు రాకకు సమయం ఉండడంతో మొబైల్ ఫోన్లో చాటింగ్ కు ఉపక్రమించాడు. చాటింగ్ చేస్తూ ప్లాట్ ఫాం అంచులకు వెళ్ళాడు. అదే సమయంలో వెనుకనుంచి వచ్చిన రైలు సుజిత్ ను ఈడ్చుకువెళ్ళింది. ఆ రైలుకు అక్కడ హాల్టు లేదు. వేగంగా వెళుతున్న రైలు బలంగా ఈడ్చుకువెళ్ళడంతో సుజిత్ ప్రాణాలు విడిచాడు. సుజిత్ బ్యాగ్ ను పరిశీలించిన పోలీసులు యూకేలో అతని గార్డియన్ కు విషయం వివరించారు. అతని ద్వారా భారత్ లో ఉన్న సుజిత్ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. లండన్ లోని ఓ తెలుగు సంస్థ సహకారంతో, సుజిత్ మృతదేహం సోమవారం అతని స్వస్థలం కృష్ణా జిల్లా వీరులపాడు చేరుకోనుంది.

More Telugu News