వణుకుతున్న ట్రావెల్స్ బస్సుల యజమానులు... బస్సులు ఆపేసిన కేఎస్ఆర్టీసీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వణుకుతున్న ట్రావెల్స్ బస్సుల యజమానులు... బస్సులు ఆపేసిన కేఎస్ఆర్టీసీ

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించడంతో ఈ రాష్ట్రానికి బస్సులను నడిపే ట్రావెల్స్ యజమానులు ఏ క్షణాన ఏ న్యూస్ వినాల్సి వస్తుందోనని వణుకుతున్నారు. అసలే తమిళనాట జయలలితకు విపరీతమైన ఆదరణ ఉంది. ఆమెకు శిక్ష ఖరారవగానే ఎవరు ఏ బస్సును తగల బెడతారోననే భయం సర్వత్ర అలుముకుంది. దీంతో ఇంచుమించుగా ప్రైవేటు బస్సులన్నిటినీ రద్దు చేసుకుంటున్నారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు నడిపే బస్సులన్నింటినీ కేఎస్ఆర్టీసీ రద్దు చేసింది. కర్ణాటక నుంచి పలు ప్రాంతాలకు బస్సులు నడిపై ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు కూడా బస్సులు రద్దు చేసుకున్నారు.

More Telugu News