కంటతడిపెట్టిన జయలలిత
తమిళనాట ఉక్కు మహిళగా పేరొందిన ముఖ్యమంత్రి జయలలిత కంటతడిపెట్టారు. అక్రమాస్తుల కేసులో జయలలితను బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానం దోషిగా నిర్ధారించడంతో తమిళనాడు ఆర్ధిక మంత్రి పన్నీర్ సెల్వం కన్నీరు మున్నీరుగా విలపించారు. జయలలిత అభిమానుల సంగతి చెప్పేక్కర్లేదు. న్యాయస్థానాలను శాపనార్థాలు పెట్టేవారు కొందరైతే, అమ్మకు శిక్షా? అంటూ విలపించిన వారు మరికొందరు! న్యాయస్థానం జయలలితను దోషి అని నిర్థారించగానే తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. చెన్నయ్ లోని అన్నా డీఎంకే కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.