Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోలో జర్నీ సో బెటరు అంటున్న భారతీయులు

ప్రపంచాన్ని చుట్టి రావడానికి భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే నిత్య జీవితంలో 'కుటుంబ'రావు అయిన భారతీయుడు, పర్యటనకు మాత్రం 'సోలో జర్నీ సో బెటరు' అని ఫీలవుతున్నాడు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఓ సంస్థ పలు దేశీయులు చేసే పర్యటనలపై సర్వే చేసింది. అలాగే భారతీయుల పర్యటనలపై సర్వే చేసి, దాని వివరాలు వెల్లడించింది. ప్రశాంతతకు, కొత్త విషయాలు, ప్రాంతాలతో పరిచయం పెంచుకునేందుకు కుటుంబ పితలాటకం ఎందుకని భావిస్తూ, సింగిల్ గానే పర్యటనలకు వెళ్తున్నారట. అయితే, ఎటొచ్చీ ఈ విషయంలో కుటుంబం ముందు వాళ్ల పప్పులు ఉడకడం లేదట. కుటుంబంతో పాటు పర్యటనలను ఆస్వాదిస్తున్నవారు 45 శాతం మంది ఉండగా, ప్రెండ్స్ తో ప్రపంచాన్ని చుట్టేసే వాళ్లు 32 శాతం మంది ఉన్నారు. కొత్త ప్రాంతాలు చూడాలనుకునే వారు 56శాతం మంది ఉండగా, 8 శాతం మంది తాము చూసిన ప్రాంతాలనే మళ్లీ మళ్లీ చూస్తున్నారని సర్వే వెల్లడించింది. భారతీయుల అభిరుచుల్లో మార్పులు వస్తున్నాయని, సెలవులు వచ్చాయంటే చాలు హాలీడే టూర్ కు చెక్కేసేందుకు ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారని సర్వే తెలిపింది. దీంతో టూరిస్టుల సంఖ్య ఏటికేడు పెరుగుతోందని సర్వే వివరించింది. ఇంట్లో ఉండేప్పుడు డైటింగ్ అంటూ భోజనంపై బెట్టు చేసే వారంతా పర్యటనల్లో నిబంధనలకు నీళ్ళొదిలేస్తున్నారట, స్థానిక వంటలు లొట్టలేస్తూ తింటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారట. 70 శాతం మంది భారతీయులు భోజన ప్రియులని సర్వే స్పష్టం చేసింది.

More Telugu News