విజయవాడ ఇంద్రకీలాద్రికు పోటెత్తిన భక్తులు
దసరా శరన్నవరాత్రి మహోత్సవాల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. దుర్గమ్మవారిని దర్శంచుకునేందుకు క్యూలలో బారులు తీరారు. అటు వీఐపీల దర్శనం పేరుతో అధికారులు అంతరాలయ ప్రవేశాన్ని నిలిపివేశారు. దాంతో, దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్న సామాన్య భక్తజనం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు అమ్మవారు బాలాత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిస్తోంది.