పోలీసులమంటూ తనిఖీలు... ఆనక వారికే అరదండాలు
పోలీసులమంటూ హల్ చల్ చేసిన యువకులకు స్థానికులు అరదండాలు వేయించిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా జాజిరెడ్డి గూడెంలో కొందరు యువకులు పోలీసులమని చెప్పి పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అసలు పోలీసులు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు తనిఖీలు చేయడమేంటని అనుమానం వచ్చిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నకిలీలుగా గుర్తించి అరదండాలు వేశారు.