పెద్దపులి కేసీఆర్, యువకుడు ఎర్రబెల్లి, రెచ్చగొట్టిన సందర్శకుడు రామేశ్వరరావు: రేవంత్
కేసీఆర్, మై హోమ్స్ రామేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావులను ఢిల్లీ లో జరిగిన జూ సంఘటనతో పోలుస్తూ టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి నిన్న విలేకరుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ జూలో ఒక యువకుడు పెద్దపులి ఎన్ క్లోజర్ లో దూకితే, పది నిమిషాల పాటు అది ఏమీ చేయకపోయినా, సందర్శకులు రాళ్లు విసరడంతో రెచ్చిపోయి యువకుడిని చంపేసినట్లు వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ ''అందులో్ని యువకుడు తమ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కాగా, పెద్దపులి కేసీఆర్. దాన్ని రాళ్లు వేసి రెచ్చగొట్టేది మై హోమ్స్ రామేశ్వరరావు'' అని రేవంత్ రెడ్డి ఉదహరించారు. గతంలో తెలంగాణ వాదాన్ని తన స్వార్థం కోసం ఉపయోగించుకుని కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పుడు కులవాదంతో ఎర్రబెల్లిని మభ్యపెడుతున్నారని ఆయన ఆరోపించారు.