ఈ భారత యూనివర్శిటీ బిలియనీర్లకు పుట్టిల్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ భారత యూనివర్శిటీ బిలియనీర్లకు పుట్టిల్లు!

భారత్ లో ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ముంబయి యూనివర్శిటీ ఒకటి. ఈ వర్శిటీకి ఓ ఘనత ఉంది. దేశంలోకెల్లా ఎక్కువమంది బిలియనీర్లను అందించిన విద్యాసంస్థగా ఇది వినుతికెక్కింది. భారత్ లో ఉన్న వంద మంది బిలియనీర్లలో 12 మంది ముంబయి విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్ళే. దేశంలోని మరే విశ్వవిద్యాలయంలోనూ ఇంతమంది బిలియనీర్లు చదవలేదట. ముంబయి వర్శిటీలో చదవిన వారిలో భారత రిచెస్ట్ మ్యాన్ ముఖేశ్ అంబానీ కూడా ఉన్నారు. బిలియనీర్లను అందించిన విద్యాసంస్థల జాబితాలో ముంబయి వర్శిటీ తొమ్మిదో స్థానంలో ఉంది. సింగపూర్ కు చెందిన వెల్త్-ఎక్స్, స్విస్ బ్యాంక్ యూబీఎస్ ఈ మేరకు అధ్యయనం చేపట్టింది. ఈ జాబితాలో యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా (25) అగ్రస్థానంలో ఉంది. వరుసగా రెండు మూడు స్థానాల్లో హార్వర్డ్ యూనివర్శిటీ (22), యేల్ యూనివర్శిటీ (20) ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (11) ముంబయి తర్వాత పదో స్థానంలో ఉంది.

More Telugu News