పాలక మండళ్ల రద్దు అంశంలో ఏపీ సర్కారుకు ఊరట
ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాల పాలక మండళ్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. దాంతో, ప్రభుత్వానికి ఊరట లభించింది. ఆలయ ట్రస్టు భూములను కాపాడేందుకే ఆర్డినెన్స్ ను చట్టరూపంలోకి తెచ్చామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సర్కారు వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం... పాలక మండళ్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపింది.