సిండికేట్ బ్యాంక్ సీఎండీ తొలగింపు
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, అరెస్టయిన ఎస్ కే జైన్ ను సీఎండీ పదవి నుంచి సిండికేట్ బ్యాంక్ తొలగించింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. జైన్ పైనా, మధ్యవర్తిగా ఉన్న పురుషోత్తమ్ తొత్లానిపైనా కోర్టు ఆగస్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తర్వాత, కొన్ని రోజులకే, అంటే, ఆగస్టు 7న సీబీఐ అధికారులు జైన్ ను అదుపులోకి తీసుకున్నారు.