వరవరరావును విడుదల చేయాలంటూ ప్రజాసంఘాల డిమాండ్
రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక సదస్సు నేపథ్యంలో ముందస్తుగా అరెస్టు చేసిన వరవరరావును వెంటనే విడుదల చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించాల్సిన సదస్సుకు హైకోర్టు అనుమతి నిరాకరించిందని పోలీసులు తెలిపారు. అందుకే, తాము ఈ సదస్సుకు అనుమతివ్వలేమని స్పష్టం చేశారు. ఎలాగైనా నిర్వహిస్తామని విరసం నేత వరవరరావు ప్రకటించడంతో, గతరాత్రి ఆయనను అరెస్టు చేశారు. కాగా, మరోనేత కల్యాణ్ రావును గుంటూరు జిల్లా మాచవరం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదు సభకు వెళుతుండగా ఆయనను అరెస్టు చేశారు. కాగా, సదస్సు నేపథ్యంలో 150 మందిని అరెస్టు చేసిన హైదరాబాదు పోలీసులు వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.