ఎరువులు అందకపోతే ఫిర్యాదు చేయండి: మంత్రి ప్రత్తిపాటి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎరువులు అందకపోతే ఫిర్యాదు చేయండి: మంత్రి ప్రత్తిపాటి

రాష్ట్రంలో ఎరువులకు కొరత లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ఎరువులను అధిక ధరలకు అమ్ముతున్నట్టు, లేదా అక్రమంగా నిల్వ చేసినట్టు తెలిసినా తమకు సమాచారం అందించాలని అన్నారు. యూరియా బస్తాపై 100 రూపాయలు అదనంగా అమ్ముతున్నట్లు సమాచారముందని, బ్లాక్ మార్కెట్ పై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామన్నారు. ఎరువుల షాపులపై దాడులు నిర్వహించి, అధిక ధరలకు ఎరువులను విక్రయించే షాపులను సీజ్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే టోల్ ఫ్రీ నంబర్ 18001801551 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు.

More Telugu News