పాక్ కొనుగోళ్లు భారత్ పై యుద్ధానికేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాక్ కొనుగోళ్లు భారత్ పై యుద్ధానికేనా?

పాకిస్థాన్ అత్యాధునిక మిలటరీ వాహనాలు సమకూర్చుకుంటోంది. రక్షణ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే పాక్, ల్యాండ్ మైన్ లను (మందు పాతరలు) తట్టుకునే వాహనాలను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. సరిహద్దుల వెంబడి శత్రుసేనలు చొరబడకుండా, ఒకవేళ చొరబడ్డా బతికి బట్టకట్టకుండా భారత భద్రతాదళాలు ల్యాండ్ మైన్ లను అమర్చుతాయి. వాటిపై వాహనం కానీ, మనిషి కానీ, జంతువు కానీ ఏదైనా సరే కాలు మోపితే ఇక ముక్కలు ముక్కలు కావలసిందే. ల్యాండ్ మైన్స్ ధాటికి ఎటువంటి వాహనమైనా ముక్కలు చెక్కలు కావాల్సిందే. అందుకే ల్యాండ్ మైన్స్ ను తట్టుకునే విధంగా పాకిస్థాన్ 160 మైన్ రెసిస్టెంట్ అంబుష్ ప్రొటెక్టడ్ (ఎంఆర్ఏపీ) వాహనాలను అమెరికా నుంచి కొనుగోలు చేసింది. వీటి విలువ సుమారు 198 మిలియన్ అమెరికన్ డాలర్లని సమాచారం. పాకిస్థాన్ 160 నావీస్టార్ ఎంఆర్ఏపీ వాహనాలు కావాలని కోరి, వాహనాలతో పాటు వాటి స్పేర్ పార్ట్ లను కూడా కొనుగోలు చేసిందని ఆమెరికా రక్షణ సంస్థ వెల్లడించింది.

More Telugu News