కాశ్మీర్ పాకిస్థాన్ లోనిది... ప్రతి అంగుళాన్ని తిరిగి తీసుకుంటాం: భుట్టో వారసుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాశ్మీర్ పాకిస్థాన్ లోనిది... ప్రతి అంగుళాన్ని తిరిగి తీసుకుంటాం: భుట్టో వారసుడు

పాకిస్ధాన్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత బిల్వాల్ భుట్టో జర్దారీ కాశ్మీర్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ పార్టీ కాశ్మీర్ ను వెనక్కు తీసుకువస్తుందన్నారు. ఈ మేరకు ముల్తాన్ ప్రాంతంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బిల్వాల్, "కాశ్మీర్ను తిరిగి వెనక్కు తీసుకువస్తాను. ఏ ఒక్క అంగుళాన్ని వదిలిపెట్టం. ఎందుకంటే, అది పాకిస్థాన్ లోనిది" అని భుట్టో కుటుంబ వారసుడు ఆవేశంగా అన్నాడు. 2018లో జరగనున్న ఎన్నికల్లో బిల్వాల్ పోటీ చేయనున్నాడు. అదే సమయంలో తన పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ధీమాగా ఉన్నారు.

More Telugu News