మీది 'ఏబీ' బ్లడ్ గ్రూపా..? అయితే, ఇది చదవండి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీది 'ఏబీ' బ్లడ్ గ్రూపా..? అయితే, ఇది చదవండి!

డిమెన్షియా... వార్ధక్యంలో వచ్చే జబ్బుల్లో ఇదీ ఒకటి. 'చిత్తచాంచల్యం'గా పరిగణిస్తారు దీన్ని. అయితే, వెర్మోంట్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు డిమెన్షియాకు వ్యక్తుల బ్లడ్ గ్రూపుకు సంబంధం ఉంటుందని అంటున్నారు. ఈమేరకు ఓ అధ్యయనం నిర్వహించారు. మిగతా బ్లడ్ గ్రూపుల కంటే, 'ఏబీ' గ్రూపు వ్యక్తుల్లో వయసు పైబడే కొద్దీ ఈ వ్యాధి లక్షణాలు తలెత్తడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయట. ప్రపంచ జనాభాలో 4 శాతం ఏబీ గ్రూపు వ్యక్తులే కాగా, వారిలో 82 శాతం వృద్ధాప్యంలో డిమెన్షియాకు గురయ్యే చాన్సులున్నాయని అధ్యయనకర్త మేరీ కుష్మన్ తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా 587 మందిని పరిశీలించగా, 495 మందిలో డిమెన్షియా లక్షణాలు కనిపించాయి. దీంతో, బ్లడ్ గ్రూపుకు ఈ మెదడు సంబంధ వ్యాధికి సంబంధం ఉంటుందన్న విషయం వెల్లడైందని కుష్మన్ పేర్కొన్నారు. కాగా, పరిశోధకులు మరో విషయాన్ని కూడా గుర్తించారు. రక్తం గడ్డ కట్టేందుకు తోడ్పడే వీ3 ప్రొటీన్ స్థాయులు ఎక్కువైనా గానీ డిమెన్షియా ముప్పు ఉంటుందని తెలిపారు.

More Telugu News