Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జమ్మూకాశ్మీర్ కు డీఎండీకే అధినేత విజయ్ కాంత్ ఆర్థిక సాయం

వరదల కారణంగా విలవిల్లాడుతున్న జమ్మూకాశ్మీర్ కు పలువురు ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కాంత్ రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి ఆ సాయాన్ని అందించారు. కష్టాల్లో ఉన్న జమ్మూకాశ్మీర్ ను ఆదుకునేందుకు సంపన్నులు, వ్యాపారవేత్తలు, యువకులు ముందుకు రావాలని కోరారు. అరవై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జమ్మూకాశ్మీర్ ను వరదలు ముంచెత్తడంతో ప్రజల జీవితం దుర్భరంగా మారిందని అన్నారు.

More Telugu News