మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసులపై దాడి చేసిన గ్రామస్తులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహబూబ్ నగర్ జిల్లాలో పోలీసులపై దాడి చేసిన గ్రామస్తులు

మహబూబ్ నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచ గ్రామస్తులు పోలీసులపై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఈ ఉదయం అవంచలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అవంచకు చేరుకున్నారు. అసలే ఆగ్రహంతో ఉన్న మృతుడి వర్గీయులు పోలీసులపై దాడి చేశారు. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News