Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దైవకణాలతో జాగ్రత్త... ప్రపంచాన్నే తుడిచిపెట్టేస్తాయి!: హాకింగ్ హెచ్చరిక

దైవకణాలు అని భావిస్తున్న హిగ్స్ బోసాన్ కణాలతో జాగ్రత్తగా వ్యవహరించాలని సుప్రసిద్ధ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సూచిస్తున్నారు. ఈ కణాలు ప్రపంచాన్నే తుడిచిపెట్టేయగల సామర్థ్యం కలవని ఆయన పరిశోధకులను హెచ్చరించారు. అత్యధిక శక్తి స్థాయుల వద్ద ఈ కణాలు అస్థిరంగా మారతాయని, ఈ పరిస్థితి పెను విపత్తుకు దారితీస్తుందని వివరించారు. కనీసం, ప్రమాదం జరగనుందని హెచ్చరిక జారీచేయడానికి కూడా వ్యవధి ఉండకపోవచ్చని, క్షణాల్లో విధ్వంసం జరిగిపోతుందని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు 2012లో హిగ్స్ బోసాన్ కణాన్ని యూరప్ లో ఉన్న 'సెర్న్' ప్రయోగశాలలో ఆవిష్కరించారు.

More Telugu News