Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేరేడ్ మెట్ లో పదకొండు లక్షలు పలికిన గణేశ్ లడ్డూ

హైదరాబాదులోని నేరేడ్ మెట్ లో వినాయకుడి లడ్డూ వేలం పాటలో భారీ ధర పలికింది. ఇక్కడి వెస్ట్ దీన్ దయాల్ నగర్ గణేష్ లడ్డూను రూ.11.75 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకూ నగరంలో ఎక్కడా ఇంత ధర పలకకపోవడం విశేషం. అటు బాలాపూర్ లడ్డూ ధర కంటే మరింత అధికంగా పలకడం గమనార్హం.

More Telugu News