13న ప్రవాస భారతీయుల సంక్షేమంపై అబుదాబిలో భారత రాష్ట్రాల సదస్సు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

13న ప్రవాస భారతీయుల సంక్షేమంపై అబుదాబిలో భారత రాష్ట్రాల సదస్సు

గల్ఫ్ దేశాల్లో భారత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు భారత ప్రభుత్వం అనుసరించనున్న చర్యలు, కార్మికుల సంక్షేమంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబిలో ప్రత్యేక సదస్సు జరగనుంది. ఈ నెల 13న జరిగే ఈ సదస్సులో భారత్ లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా తమ ప్రతినిధులను పంపేందుకు సుముఖత వ్యక్తం చేశాయని వలసదారుల హక్కుల సంఘం తెలంగాణ ఉపాధ్యక్షుడు మంద భీంరెడ్డి తెలిపారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం, భారత ప్రవాస భారతీయుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సమావేశానికి గోవా, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం యూఏఈలో 17.5 లక్షల మంది భారతీయులు ఉండగా, వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే 1.7 లక్షల మంది ఉన్నారు. వలస కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలతో పాటు కార్మికుల ఫిర్యాదుల పరిష్కారంపై ప్రవాస భారతీయ సంఘాల పాత్రపై కూడా కూలంకషంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.

More Telugu News