Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సానియాను బ్రాండ్ అంబాసిడర్ గా వెనకేసుకొచ్చిన కేంద్ర మంత్రి

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియామీర్జాను నియమించడంపట్ల అభ్యంతరాలు వెల్లువెత్తుండడం పట్ల కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సానియా లాంటి టెన్నిస్ క్రీడాకారిణి మన దేశంలో ఉండడం గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం పట్ల తమకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. స్వశక్తితో ఆమె దేశం గర్వించదగ్గ విజయాలు సొంతం చేసుకుందని ఆయన కొనియాడారు.

More Telugu News