స్కూల్ బస్సు ప్రమాదంలో బాధితులకు పరిహారం ప్రకటించిన రైల్వే మంత్రి
మెదక్ జిల్లా మాసాయిపేటలో ఇవాళ ఉదయం స్కూల్ బస్సును ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనకు సంబంధించి పార్లమెంటులో రైల్వే మంత్రి సదానంద గౌడ మాట్లాడారు. ఈ ప్రమాదంలో 18 మంది చనిపోయినట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. స్వల్పంగా గాయపడిన వారికి రూ.20 వేలు ఎక్స్ గ్రేషియా ఇస్తామని ఆయన ప్రకటించారు.