శ్రీవారి సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారి సమాచారం

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రావణ శుక్రవారం సందర్భంగా నిన్నటి నుంచి తిరుమలకు భక్తుల తాకిడి ఎక్కువైంది. శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 22 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తుల దివ్యదర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. శుక్రవారం నాడు శ్రీవేంకటేశ్వర స్వామిని 54,052 మంది భక్తులు దర్శించుకున్నారు.

More Telugu News