'ఐపీఎల్' కు నిఘా వర్గాల హెచ్చరిక
విశేష ప్రజాదరణతో జనరంజకంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీ20 క్రికెట్ టోర్నీకి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అమెరికాలోని బోస్టన్ వద్ద ఈ ఉదయం జరిగిన పేలుళ్ళ నేపథ్యంలో ఐపీఎల్ నిర్వాహకులకు నిఘా వర్గాలు స్పష్టమైన హెచ్చరికలు జారీచేశాయి. ఐపీఎల్ మ్యాచ్ లను టెర్రరిస్టులు లక్ష్యంగా ఎంచుకునే అవకాశమున్నందున, మెట్రో నగరాల్లో ఐపీఎల్ మ్యాచ్ లు జరిగే వేళ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. ఆయా మ్యాచ్ వేదికల వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని ఇంటలిజెన్స్ బ్యూరో ఓ ప్రకటనలో పేర్కొంది.