జోలపాటలు శిశువు ఆరోగ్యానికి మేలు చేస్తాయట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జోలపాటలు శిశువు ఆరోగ్యానికి మేలు చేస్తాయట!

జో అచ్యుతానంద జో జో ముకుందా/ లాలి పరమానంద రామగోవిందా జో జో... అంటూ సాగే ఈ జోలపాటకు పరవశించని శిశువు ఉండదు ... రాగయుక్తంగా పాడాలేగానీ! పదకవితా పితామహుడు అన్నమయ్య ఈ గీతాన్ని మనకందించే క్రమంలో తానెంత మైమరచిపోయి ఉంటాడో! అంతటి శ్రీవేంకటేశ్వరుణ్ణి సైతం నిద్రబుచ్చాయి తాళ్ళపాక వారి లాలిపాటలు. వాటి మహత్మ్యం అలాంటిది. నేటి పరిశోధకులు సైతం కమ్మని జోలపాటల్లోని మెత్తదనంలో ఏదో మహత్తు ఉందని భావిస్తున్నారు. అందుకే, నెలలు తిరగకముందే పుట్టిన శిశువులకు జోలపాటలు ఆరోగ్యాన్నిస్తాయని సూచిస్తున్నారు. ఆ పసికందును తల్లి పొదివి పట్టుకుని ఓ పాట అందుకుంటే తల్లి ఆరోగ్యంతో పాటు బిడ్డ ఆరోగ్యమూ మెరుగవుతుందట. ముఖ్యంగా వారి హృదయస్పందన సాఫీగా సాగుతుందట. ఇజ్రాయెల్ లోని మీర్ ఆసుపత్రిలో 86 తల్లి-బిడ్డల జోడీలపై అధ్యయనం నిర్వహించి వారు ఈ విషయాలను వెల్లడించారు. ఇలా తల్లి తన బిడ్డను హత్తుకోవడాన్ని వారు 'కంగారూ కేర్' గా అభివర్ణిస్తున్నారు.

More Telugu News