Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ ఎవరయ్యేనో!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టైటిల్ స్పాన్సర్ షిప్ కోసం బిడ్లను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ మధ్య కాలానికి ఈ స్పాన్సర్ షిప్ వర్తిస్తుంది. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ల కోసం తాము ఈ బిడ్లను ఆహ్వానిస్తున్నట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. బిడ్లను ఈ నెల 6 నుంచి 28 వరకు స్వీకరిస్తారు. అధిక ధర కోట్ చేసిన సంస్థకు ఆయా మ్యాచ్ ల టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులు దక్కుతాయి. గత సీజన్ లో స్టార్ ఇండియా ఈ హక్కులు చేజిక్కించుకుంది. ఈ సెప్టెంబర్ నుంచి వచ్చే ఏప్రిల్ మధ్య కాలంలో టీమిండియా మూడు టెస్టులు, ఐదు వన్డేలు ఆడనుంది. దేశవాళీ పోటీల్లో భాగంగా రంజీ ట్రోఫీ, ఇరానీ కప్, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ పోటీలు జరుగుతాయి.

More Telugu News