Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇద్దరు మహిళా షూటర్లకు 'బిగ్ బి' ఆర్ధిక సాయం

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇద్దరు షూటింగ్ క్రీడాకారిణులకు సహాయం చేయనున్నారు. షూటింగ్ లో రాణిస్తున్న యువక్రీడాకారిణులు అయోనికా పాల్, పూజా ఘట్కర్ ల శిక్షణకు అయ్యే ఖర్చును అమితాబ్ ఇకపై భరించనున్నారు. ప్రముఖ ఎన్జీవో సంస్థ 'ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్' 2016 రియో ఒలింపిక్స్ లో భారత్ కు ఎక్కువ పతకాలు అందించేందుకు 'మెడల్స్ ఫర్ ఇండియా' అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా గోల్డ్ క్వెస్ట్ సంస్థ దేశవ్యాప్తంగా ఒలింపిక్స్ పతకం గెలుచుకోగల సత్తా ఉన్న క్రీడాకారులను గుర్తించి.... తగిన శిక్షణ, ప్రోత్సాహం ఇస్తోంది. 'మెడల్స్ ఫర్ ఇండియా' కార్యక్రమం ద్వారానే అమితాబ్ ఈ ఇద్దరు క్రీడాకారులకు అయ్యే శిక్షణ ఖర్చును స్పాన్సర్ చేయనున్నారు.

More Telugu News