: పాక్ గ్రామాలకు కొన్ని రోజులపాటు కునుకు లేకుండా చేసిన భారత పులి


మన భూభాగాన్ని దాటి పాకిస్థాన్ లోకి ప్రవేశించిన ఓ భారత పులిని పాక్ అధికారులు బంధించారు. ఇండియా, పాకిస్థాన్ ల మధ్య ఉన్న సియాల్ కోట్ సరిహద్దుకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటమానల్ గ్రామంలోకి ఈ పులి ప్రవేశించింది. కోటమానల్ గ్రామంలో పాడిపశువులతో పాటు ఇద్దరు వ్యక్తులపై కూడా పులి దాడి చేసింది. ప్రతీ రోజు ఏదో ఒక సమయంలో సరిహద్దు గ్రామాలపై పులి దాడి చేస్తుండడంతో... అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యారు. గత కొన్ని రోజులుగా పాక్ లో ఉన్న సరిహద్దు గ్రామాల ప్రజలు పులిభయంతో పట్టపగలు కూడా బయటకు రాకుండా తలుపులు మూసుకునే తమ జీవితాన్ని గడుపుతున్నారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పాక్ లోని పంజాబ్ జంతు సంరక్షణ విభాగం అధికారులు... కొన్ని రోజుల పాటు అష్టకష్టాలు పడి పులిని బంధించారు. వెంటనే పులిని లాహోర్ నగరంలో ఉన్న 'జూ'కి తరలించారు. ఈ ఏడాది జనవరిలో ఇదే తరహాలో సియాల్ కోట సరిహద్దుకు 80 కోట్ల దూరంలో ఉన్న పాక్ సరిహద్దు గ్రామం పార్ సుర్ లోకి ప్రవేశించిన భారత చిరుతపులిని పాక్ అధికారులు బంధించారు.

  • Loading...

More Telugu News