మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం ఇస్తాం: కేటీఆర్
మహిళా పారిశ్రామికవేత్తలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. హైదరాబాదులో ఫిక్కీ మహిళా విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... సైబరాబాదులో మహిళా ఉద్యోగుల భద్రత కోసం మరిన్ని చర్యలు చేపడుతున్నామని చెప్పారు. హైదరాబాదును స్మార్ట్ అండ్ సేఫ్ సిటీగా రూపొందిస్తామని ఆయన అన్నారు. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో హైదరాబాదు ఇప్పటికే అభివృద్ధి సాధించిందని కేటీఆర్ అన్నారు.