విశాఖలో వైభవంగా సాగిన దీపోత్సవం
విశాఖలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవం రెండో రోజు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో శ్రీవారికి అర్చకులు తిరుప్పావై సేవ నిర్వహించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో దీపోత్సవం కన్నుల పండువగా సాగింది. విశాఖ వాసులు భక్తిశ్రద్ధలతో తిరుమలేశుడికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులతో ఇండోర్ స్టేడియం నిండిపోయింది. ఈ కార్యక్రమం మరో ఐదు రోజుల పాటు కొనసాగుతుంది.