నేడు ఢిల్లీకి ఆంధ్రా అఖిలపక్షం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు నేడు ఢిల్లీకి అఖిలపక్ష బృందం బయల్దేరనుంది. ఈ బృందానికి మంత్రులు గంటా శ్రీనివాసరావు, రావెల నేతృత్వం వహిస్తారు. కాగా, ఇందులో వైసీపీ నుంచి జ్యోతుల నెహ్రూ, కాంగ్రెస్ నుంచి రఘువీరా, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, సీపీఎం తరఫున మధు, సీపీఐ నుంచి రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.