ఫేస్ బుక్ లో అకౌంట్ ఉందా?... అయితే, మీ కాపురానికి కాలం చెల్లినట్టే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫేస్ బుక్ లో అకౌంట్ ఉందా?... అయితే, మీ కాపురానికి కాలం చెల్లినట్టే!

ఫేస్ బుక్ అకౌంట్ ఉందా? అయితే మీ కాపురానికి కాలం చెల్లినట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక సంబంధాలు విస్తృతం చేసుకునేందుకు, అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఉద్భవించిన ఫేస్ బుక్ పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతోందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఫేస్ బుక్ విరివిగా వాడుతున్న కారణంగా అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో విడాకుల కేసులు పెరిగినట్టు పరిశోధకులు తెలిపారు. గత ఏడాది కాలంలో ఫేస్ బుక్ కారణంగా 4 శాతం ఎక్కువ విడాకుల కేసులు నమోదైనట్టు నిపుణులు చెప్పారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి వెబ్ సైట్లలో ఎక్కువ శాతం గడిపేవారి వైవాహిక జీవితంలో స్పర్థలు ఎక్కువైనట్టు గమనించామని పరిశోధకులు స్పష్టం చేశారు. ఫేస్ బుక్ కారణంగా మనదేశంలో అమ్మాయిలు చాలా సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. చాలా మంది మోసపోతున్నారు. ఫేస్ బుక్ మోసాలు ఈ మధ్య కాలంలో విరివిగా చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఫేస్ బుక్ లో పోస్టు చేస్తున్న ఫొటోలు, పెడుతున్న కామెంట్ల కారణంగా చాలా కుటుంబాల్లో సమస్యలు తలెత్తినట్టు నిపుణులు చెప్పారు. కాగా, విడాకులు తీసుకున్న వారిలో ఫేస్ బుక్ వినియోగం పెరిగిందా? లేదా? అనే విషయాన్ని పరిశోధకులు వెల్లడించలేదు.

More Telugu News