సెక్షన్ 377ను సవరించే ఆలోచన లేదు: మోడీ ప్రభుత్వం
స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెల్లడయ్యేవరకూ సెక్షన్ 377ను సవరించడంగానీ, రద్దుచేసే ఆలోచనగానీ ఎంతమాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్రమంత్రి కిరణ్ రిజ్జూ నేడు లోక్ సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. "సెక్షన్ ను తొలగించం. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. సుప్రీం నిర్ణయం తెలిపాకే ఐపీసీ సెక్షన్ 377పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది" అని తెలిపారు.
2013, డిసెంబర్ 11న స్వలింగ సంపర్కంపై తీర్పు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు, స్వలింగ సంపర్కం క్రిమినల్ నేరం అని, ఇందుకు చట్ట సవరణ చేయాలంటూ పార్లమెంటుకు సూచించింది. దాంతో, యూపీఏ ప్రభుత్వం కొన్నిరోజులకే ఈ విషయంపై సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్ వేసింది.