పోలీసులను సైతం కడుపారా నవ్వించిన దొంగతనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోలీసులను సైతం కడుపారా నవ్వించిన దొంగతనం

ఏటీఎమ్ దోపిడీకి ఓ దొంగ చేసిన ప్రయత్నాలు సీరియస్ గా ఉండే పోలీసులకి కూడా కడుపారానవ్వు తెప్పించాయి. హైదరాబాద్ దోమలగూడలోని వడ్డెర బస్తీకి చెందిన 20 ఏళ్ల యేసుయాదవ్ ఓ చిల్లర దొంగ. అయితే ఇతగాడు సీరియస్ దొంగతనాలు మాత్రం ఎప్పుడూ చెయ్యలేదు. క్రితం శుక్రవారం విచిత్రంగా అతను ఒక ఏటీఎమ్ ను చోరీ చేద్దామనుకున్నాడు. అయితే ఏటీఎమ్ ల మీద అతనికి ఏ మాత్రం అవగాహన లేదు. శుక్రవారం రాత్రి దోమలగూడలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఏటీఎమ్ లో చోరీ చేద్దామని వెళ్లాడు యేసుదాస్. ఏటీఎం లోపలికి వెళ్లగానే పొరపాటున డ్రాప్ బాక్స్ ను ఏటీఎం అనుకుని పెద్దరాయితో బద్దలుకొట్టాడు. దాంట్లోంచి కేవలం ఖాళీ కాగితాలే దొరకడంతో ఏం చెయ్యాలో అర్థం గాక... ఏటీఎం చుట్టూ చూడటం మొదలుపెట్టాడు. అలా ఏటీఎం లోపల చూస్తున్నప్పుడు అతనికి సీసీ కెమెరా కనపడింది. వెంటనే బయటకు వెళ్లిపోయి... ఒక నిమిషం తర్వాత తన టీ షర్ట్ ని ముఖానికి కప్పుకుని మళ్లీ వచ్చాడు... ఈసారి పెద్దరాయితో ఏటీఎం మెషీన్ ను బద్దలుకొట్టాలని రెండు నిమిషాల పాటు ప్రయత్నించాడు యేసుయాదవ్. అయితే ఎంతకీ ఏటీఎం మెషీన్ బద్దలుకాకపోవడంతో... ఆఖరికి దిగాలుగా ఉత్త చేతులతో వెళ్లడం ఎందుకని, ఏటీఎంలో ఉన్న వేస్ట్ బాస్కెట్ ను తీసుకెళ్లాడు. బ్యాంకు అధికారుల కంప్లైట్ తో చిక్కడపల్లి పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ పుటేజ్ సహాయంతో యేసుదాసును అరెస్ట్ చేశారు. సీసీటీవీ పుటేజ్ లో ఏటీఎం ను చోరీ చేయడానికి యేసుయాదవ్ పడిన ఆపసోపాలు చూసి పోలీసులు కూడా పడి పడి మనసారా నవ్వుకున్నారు. తాను ఏటీఎం మెషీన్ ను ఎప్పుడూ వాడలేదని... లోపల డబ్బులు ఎక్కడ ఉంటాయో కూడా తనకు తెలియదని యేసుదాసు పోలీసులకు విచారణలో చెప్పాడు.

More Telugu News