విదేశాల నల్లధనం సంగతి సరే...స్వదేశంలో నల్లధనం సంగతి చెప్పండి: అరుణ్ జైట్లీ ఆదేశం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విదేశాల నల్లధనం సంగతి సరే...స్వదేశంలో నల్లధనం సంగతి చెప్పండి: అరుణ్ జైట్లీ ఆదేశం

విదేశీ బ్యాంకుల్లో భారతీయ అక్రమార్కులు అక్రమంగా మగ్గబెడుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు చర్యలు మొదలు పెట్టిన ఎన్డీయే సర్కారు, తాజాగా స్వదేశంలోని నల్లధనం వెలికి తీసేందుకు కసరత్తు ఆరంభించింది. ఈ మేరకు దేశంలో అక్రమంగా నిల్వ చేసిన నల్లధనాన్ని వెలికితీయాలని ఆదాయపన్ను శాఖ సీనియర్ అధికారులను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆదేశించారు. ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారుల 30వ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి ప్రయత్నాలు ఆరంభించిందని అన్నారు. దానితో పాటు, దేశంలోపల దాగి ఉన్న నల్లధనాన్ని కూడా వెలికి తీసేందుకు ఆదాయపన్ను శాఖ అధికారులు పూర్తి స్థాయిలో కషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం నిర్దేశించిన రూ.7,36,221 కోట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆదాయపన్ను అధికారులు అత్యున్నత విలువలతో పనిచేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ప్రత్యక్ష పన్ను వసూళ్లకు సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విధించిన లక్ష్యాలు అధిగమిస్తామని ఆయన తెలిపారు.

More Telugu News