మండలి ఎన్నికల్లో విప్ ధిక్కరించిన పార్టీ ఎమ్మెల్సీలపై డీఎస్ ఫిర్యాదు
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ ఎన్నికల్లో విప్ ధిక్కరించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీలపై పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలువురు ఎమ్మెల్సీలతో వెళ్లి మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ను ఆయన కలిశారు. విప్ ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, రాజేశ్వర్ రావు, నేతి విద్యాసాగర్ రావు, భూపాల్ రెడ్డి, భాను ప్రసాద్, ఆమోస్, రాజలింగం, జగదీశ్వర్ పేర్లను ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు. మండలి ఛైర్మన్ ఎన్నిక ముందు వీరంతా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.