ఆలయంలో చోరీకొచ్చి...హుండీలో చేయి ఇరుక్కుపోయి..!
దేవుని గుడికే కన్నమేద్దామని వచ్చిన ఆ దొంగ, ఆలయంలోనే ఇరుక్కుపోయాడు. చివరకు శ్రీకృష్ణ జన్మస్థానికి వెళ్లాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఏల్చూరులోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ చేసేందుకు ఓ దొంగ వచ్చాడు. వచ్చిందే తడవుగా హుండీలోని సొమ్మును కాజేసేందుకు చేసిన యత్నంలో భాగంగా అతడి చేయి హుండీలో ఇరుక్కుపోయింది. దీంతో బాధ తట్టుకోలేక అతడు పెట్టిన కేకలతో భక్తులు అక్కడికొచ్చి, దొంగ గారి చేతిని హుండీలో నుంచి తీసి, పోలీసులకు అప్పజెప్పారు.