నెల్లూరు జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఈసారైనా జరుగుతుందా?
నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఈసారైనా జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక జరుగుతుందా అన్నది ఇంకా తేలలేదు. జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై సభ్యులకు ఇంతవరకు సమాచారం అందలేదు. దీంతో జెడ్పీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్ ను కోరినట్లు తెలిసింది. ముందు జాగ్రత్తగా నెల్లూరులో 144 సెక్షన్ విధించారు.