తెలంగాణలో వ్యాపారాన్ని విస్తరించనున్న సీకే బిర్లా గ్రూప్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో వ్యాపారాన్ని విస్తరించనున్న సీకే బిర్లా గ్రూప్

1.6 బిలియన్ల విలువైన సీకే బిర్లా గ్రూప్ తెలంగాణలో సిమెంట్, ఆస్బెస్టాస్ కు చెందిన తన వ్యాపారాన్ని మరింత విస్తరించనుంది. అంతేకాకుండా తెలంగాణలో వైద్య, విద్య రంగాల్లో పెట్టుబడులు పెట్టనుంది. కాసేపటి క్రితం తెలంగాణ ముఖ్యమంత్రితో సీకే బిర్లా గ్రూప్ ఛైర్మన్ సీకే బిర్లా భేటీ అయ్యారు. బిర్లా ప్రతిపాదనలకు కేసీఆర్ అంగీకరించారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో ఓరియంటల్ సిమెంట్ ఇండస్ట్రీ, హైదరాబాదులో ఆస్బెస్టాస్ ఇండస్ట్రీ (హెచ్ఐఎల్)లను సీకే బిర్లా గ్రూప్ నిర్వహిస్తోంది.

More Telugu News