Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చైనాలో కండోమ్ ఆకృతిలో ఐస్ క్రీమ్స్... ప్రజల్లో ఆగ్రహం

చైనాలో ఓ ఐస్ క్రీమ్ తయారీ సంస్థ కండోమ్ ఆకృతిలో ఐస్ క్రీమ్స్ తయారుచేసి వార్తల్లోకెక్కింది. దీనిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఐస్ పాప్ లుగా పిలుచుకునే వీటిని సదరు సంస్థ 'బబుల్ క్రీమ్' పేరిట మార్కెట్లోకి వదిలింది. ఓ రబ్బరు తొడుగులో ఉండే ఈ ఐస్ క్రీమ్ ను మూత తెరిచి తినాల్సి ఉంటుంది. అయితే, ఓ వ్యక్తి 'బబుల్ క్రీమ్' కొంటున్న పలువురు చిన్నారుల ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానిపై స్పందిస్తూ, దాన్ని తినడానికి పెద్దవాడినైన తనకు సిగ్గేసిందని, అందుకే పిల్లలకిచ్చేశానని తెలిపాడు. ఇంకో వ్యక్తి, తానెందుకు ఆ ఐస్ పాప్ తినడంలేదో తన కుమారుడికి వివరించలేక సతమతమయ్యానని చెప్పుకొచ్చాడు. మొత్తమ్మీద ఈ వినూత్న తరహా ఐస్ క్రీములపై చైనాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

More Telugu News