తిరుమలేశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలేశుని దర్శనానికి పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తుల దివ్యదర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక, తిరుమలలో అద్దె గదులు దొరకక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

More Telugu News