నదుల అనుసంధానాన్ని పదేళ్లలో పూర్తి చేస్తాం: ఉమాభారతి
దేశ వ్యాప్తంగా ఉన్న నదుల అనుసంధానాన్ని వచ్చే పదేళ్లలో పూర్తి చేస్తామని కేంద్ర నీటివనరుల శాఖ మంత్రి ఉమాభారతి ప్రకటించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాల్సి ఉంటుందని ఆమె అన్నారు. నదుల అనుసంధానం పూర్తయితే దేశం సుభిక్షం అవుతుందని ఆమె అన్నారు. దేశంలో ఎన్నో జీవనదులు ఉన్నా... భారత్ ఇప్పటికీ తాగు, సాగునీటి కొరతతో బాధపడటం దురదృష్టకరమని ఆమె అన్నారు. పార్లమెంట్ లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. నదుల అనుసంధానానికి ఆర్థిక మంత్రి జైట్లీ 2014-15 బడ్జెట్ లో రూ. 100 కోట్లు కేటాయించారు.