జడేజాకు చేదు అనుభవం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జడేజాకు చేదు అనుభవం

తొలిటెస్టులో ఇంగ్లండ్ బౌలర్ ఆండర్సన్ తో వాగ్వివాదం నెరిపిన టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు చేదు అనుభవం ఎదురైంది. లార్డ్స్ లో నిన్న ఆరంభమైన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వస్తున్న జడేజాను ఉద్దేశించి ప్రేక్షకులు అవహేళన చేశారు. దీనిపై రాహుల్ ద్రావిడ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ప్రేక్షకులు జడేజాను గేలి చేయడం తీవ్ర అసంతృప్తి కలిగిస్తోందన్నాడు. తొలి టెస్టులో చోటు చేసుకున్న వివాదం గురించి వారికేం తెలుసని ద్రావిడ్ ప్రశ్నించాడు. ఇక, ఇంగ్లండ్ మాజీ సారథి మైక్ అథర్టన్ సైతం లార్డ్స్ లో క్రికెట్ ఫ్యాన్స్ వైఖరిని తప్పుబట్టాడు. గత ఏడాది యాషెస్ నుంచి వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని అభిప్రాయపడ్డాడు. వివాదంలో తప్పు ఏ ఆటగాడిదో తేలకుండానే ప్రేక్షకులు దుందుడుకుగా ప్రవర్తించడం దురదృష్టకరమని అన్నాడు.

More Telugu News