Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్వతంత్ర విచారణ జరగాల్సిందే: జర్మనీ ఛాన్సలర్

మలేసియా విమాన దుర్ఘటనపై అంతర్జాతీయంగా స్వతంత్ర విచారణ జరగాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అన్నారు. ఉక్రెయిన్ తిరుగుబాటు దళాల దాడిలో నేలకొరిగిన మలేసియా విమాన ప్రమాదంలో 295 మంది అమాయక ప్రజలు మృత్యువాత పడటంపై గురువారం రాత్రి ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసలు అంత ఎత్తున వెళుతున్న విమానాన్ని ఉక్రెయిన్ తిరుగుబాటు దళాలు ఎలా పేల్చేశాయన్న అంశంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై జర్మనీ విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టిమ్నర్ కూడా స్పందించారు. ‘ఈ ప్రమాద వార్త తెలియగానే తీవ్ర భయాందోళనలకు గురయ్యాను. మృతులంతా అమాయక పౌరులన్న విషయం నన్ను కలచివేస్తోంది. అసలు మాటలు రావడం లేదు’ అని అన్నారు.

More Telugu News