హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఎలక్ట్రానిక్ పరిశ్రమల సంఘం (ఎలియాప్) సిద్ధంగా ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం స్ధలం కేటాయించగానే పెట్టుబడులు పెట్టనున్నామని ఎలియాప్ తెలిపింది. ఎలియాప్ పరిధిలో 64 ఎలక్ట్రానిక్ కంపెనీలు ఉన్నాయి. ఎలియాప్ హైదరాబాదులో పెట్టుబడి పెడితే 1200 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని సమాచారం. భూకేటాయింపులు, భూ విస్తీర్ణం, భూమి ధరలపై స్పష్టత వచ్చాక, పెట్టుబడులు వస్తాయి.