ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డీలా పడి ఉంది. ఈ పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడం మరచిన కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆధిపత్యం కోసం కత్తులు నూరుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై మొదటి నుంచి గుర్రుగా ఉన్న సీఎల్పీ నేత జానారెడ్డి పార్టీ పగ్గాలను చేపట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వచ్చే నెల 4న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు, ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో సమావేశం నిర్వహించనున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలు, బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణ లాంటి అంశాలు సమావేశ ప్రధాన అజెండాగా ఉన్నప్పటికీ... పొన్నాలను టార్గెట్ చేయడానికే ఈ సమావేశమనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ జానారెడ్డి... అప్పటి నుంచి పొన్నాల నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ కు దీటుగా పార్టీని పొన్నాల నడిపించలేకపోయారనే అంశాన్ని జానా హైలైట్ చేస్తున్నారు. మరోవైపు జానా వ్యవహారంపై పొన్నాల మండిపడుతున్నారు. తనను పలుచన చేసేందుకే జానారెడ్డి సమావేశం ఏర్పాటు చేస్తున్నారని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే పార్టీ హైకమాండ్ దృష్టికి పొన్నాల తీసుకెళ్లినట్టు సమాచారం.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు