సల్మాన్ ఖాన్ మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఈసారి మీడియాపైనే కయ్యానికి కాలు దువ్వాడు సల్మాన్. శుక్రవారం జరిగిన 'కిక్' ప్రచార వేడుకలో సల్మాన్ కు, బాలీవుడ్ స్టిల్ ఫొటోగ్రాఫర్లకు గొడవ మొదలైంది. సల్మాన్ పర్సనల్ బాడీగార్డ్ లు తమతో అనుచితంగా ప్రవర్తించారని ఈవెంట్ జరుగుతున్న సమయంలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఫొటోగ్రాఫర్లు. గొడవ మధ్యలో సల్మాన్ కలుగజేసుకుని, ఫొటోగ్రాఫర్లు కావాలంటే ఈవెంట్ కవర్ చేయవచ్చని, లేకపోతే వెళ్లిపోవచ్చని సభాముఖంగా చెప్పాడు. దీంతో అసలే కోపంతో ఉన్న ఫొటోగ్రాఫర్లు అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. జరిగిన సంఘటనపై సల్మాన్ తమకు క్షమాపణ చెప్పవలసిందేనని... అంతవరకు తాము సల్మాన్ ఈవెంట్స్ ను కవర్ చేయమని ఫోటోగ్రాఫర్ల యూనియన్ బాలీవుడ్ కు తేల్చి చెప్పింది.
అయితే, జరిగిన విషయాన్ని సల్మాన్ ఖాన్ చాలా లైట్ గా తీసుకున్నాడు. తన ఫొటోలు తీయకపోవడం వల్ల ఫోటోగ్రాఫర్లే పని కోల్పోతారని... అయినా వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు సల్మాన్. ఫొటోగ్రాఫర్లు తనపై విధించిన నిషేధాన్ని ఎంత ఎక్కువ కాలం కొనసాగిస్తే తాను అంత ఎక్కువగా హర్షిస్తానని సల్మాన్ మీడియాకు చురకలంటించాడు. బాలీవుడ్ పెద్దమనుషులు ఈ విషయంలో జోక్యం చేసుకుని గొడవను పరిష్కరించే పనిలో ఉన్నారని ముంబై సమాచారం.
More Telugu News
-
భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు